సురక్షిత (కాచి వడపోసిన) నీటినే తాగాలి. లేకపోతే కలరా, డయేరియా లాంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. ఆహార పదార్థాలను వరదనీటిలో తడవకుండా చూడాలి. వరద నీటిలో తడిసిపోయిన ఆహార పదార్థాలను తినకూడదు. నీటిని శుభ్రపరచడానికి బ్లీచింగ్ పౌడరు కలపాలి. పరిసరాల్లో సున్నాన్ని చల్లాలి. వరదనీటిలోకి వెళ్లకూడదు. వరదల సమయంలో పాముకాటు ప్రమాదాలు ఎక్కువ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తెగిపడిన విద్యుత్ తీగలను తాకకూడదు.