బంగాళాదుంపని కళ్ళ చుట్టూ అప్లై చేయడం వల్ల కంటి చుట్టూ నల్లని వలయాలు దూరమవ్వడమే కాకుండా పఫీనెస్ కూడా తగ్గుతుంది. బంగాళాదుంప రసాన్ని ముఖానికి రాస్తే ఇది స్కిన్ టెక్చర్‌ని పెంచి కాంతివంతంగా కనిపించేలా చేస్తుంది. దానిలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దీంతో స్కిన్ ఇరిటేషన్, అలర్జీ వంటి సమస్యలు దూరమవుతాయి. అంతేకాదు.. ఈ జ్యూస్‌లోని గుణాల వల్ల మచ్చలు, ముడతలు కూడా తగ్గుతాయి.