మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే మెదడు చురుకుదనం తగ్గడం, జీవక్రియలకు ఆటంకం కలుగడం, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు వస్తాయి. తలనొప్పితో పాటు రోగనిరోధకశక్తి తగ్గే అవకాశం ఉంది. రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోయి, ఎనర్జీ లెవల్స్ తగ్గుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.