మొయితీలకు గిరిజన గుర్తింపు ఇవ్వొద్దన్న డిమాండుతో ప్రదర్శనలు జరిపిన కుకీలపై రాష్ట్ర ప్రభుత్వం కర్కశంగా వ్యహరించింది. సరిగ్గా 16 నెలల క్రితం కుకీ గ్రామాలపైనా, కుకీ తెగ మహిళలపైనా అల్లరిమూకలు సభ్యసమాజం తలదించుకునేంత అమానవీయంగా హత్యలకు, అత్యాచారాలకు, మూకుమ్మడి దాడులకు, దహనాలకు పాల్పడినా బిజెపి ప్రభుత్వం పట్టించుకోలేదు. బాధిత మహిళలు, పురుషులూ పోలీసుల శరణు కోరినా రక్షణ దొరకలేదు. రాష్ట్ర ప్రభుత్వం తనకు తానుగా నివారించే ప్రయత్నం చేయలేదు.