బిజెపి మణిపూర్‌లో 2022 నుంచీ ఏలుబడిలో ఉంది. అప్పుడూ ఇప్పుడూ కూడా కేంద్రంలో మోడీ నాయకత్వంలోని ఎన్డీఎనే అధికారంలో ఉంది. కానీ మణిపూర్‌కి ఏ మేలూ చేయకపోగా, తెగల మధ్య ఉన్న విబేధాలను విద్వేష విధ్వంస స్థాయికి తీసుకెళ్లారు. కుకీల ప్రయోజనాలకు భంగం కలిగించే విధానాలకు, నినాదాలకు బీజేపీ కొమ్ము కాచింది. రాష్ట్రం మొత్తానికి సీఎంగా వ్యవహరించాల్సిన బీరేన్ సింగ్ మెయితీల ప్రతినిధిగానే అనేక సందర్భాల్లోనూ వ్యాఖ్యానించి, కుకీల్లో అభద్రతను పెంచారు.