సాగు భూమిలో.. మట్టి నమూనా సేకరించే విధానం

71చూసినవారు
సాగు భూమిలో.. మట్టి నమూనా సేకరించే విధానం
రైతు తన ఒక ఎకరం పొలంలో కనీసం 6-8 చోట్ల ఆంగ్ల అక్షరం V ఆకారంలో 8 అంగుళాల లోతు వరకు అంచు మట్టిని తీయాలి. సేకరించిన నమూనాలను బాగా కలిపి శుభ్రమైన గోనె సంచిలో తీసుకొని నీడలో పరిచి ఆరబెట్టాలి. తర్వాత మట్టిని ఒక పొరగా చేసి 4 భాగాలుగా విభజించాలి. ఇప్పుడు మూలలకు ఎదురుగా ఉన్న మట్టిని మాత్రమే తీసుకోవాలి. ఇలా కనీసం 1/2 కి. మట్టి వచ్చే వరకు తీసుకోవాలి. ఈ మట్టిని ఒక ప్లాస్టిక్‌ సంచిలో వేసి భూసార పరీక్ష కేంద్రానికి వ్యవసాయశాఖ అధికారి ద్వారా పంపించాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్