డ్రోన్ టెక్నాలజీ కంపెనీ ఐవోటెక్ వరల్డ్ ఏవిగేషన్, రైతుల కోపరేటివ్ సొసైటీ ఇఫ్కో మధ్య భాగస్వామ్యం సాగు ఉత్పాదకత పెంపునకు తోడ్పడినట్టు ఈ సంస్థలు ప్రకటించాయి. 2023 డిసెంబర్‌లో ఈ సంస్థలు భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా 500 డ్రోన్లను రైతులకు సమకూర్చాయి. సాగులో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన డ్రోన్ల సాయాన్ని అందించాయి. ఇది 11 రాష్ట్రాల పరిధిలో 500 రైతులపై సానుకూల ప్రభావం చూపించినట్టు సంస్థలు వెల్లడించాయి.