ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో గేట్లను ఎత్తి దిగువన నాగార్జున సాగర్‌లోకి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. సోమవారం 3 గేట్లు ఎత్తి నీటిని వదిలిన అధికారులు.. ఇవాళ మరో రెండు గేట్లను ఎత్తివేశారు. శ్రీశైలం జలాశయం నిండు కుండలా మారడంతో పాటు.. గేట్లు ఎత్తడంతో ఆ దృశ్యాన్ని వీక్షించేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు.