CT ఫైనల్ (IND vs NZ) జియో హాట్ స్టార్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన మ్యాచ్‌గా రికార్డు నెలకొల్పింది. మ్యాచ్ ముగిసే సమయానికి వ్యూస్ సంఖ్య 90.1 కోట్లకు చేరింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచును వీక్షించేందుకు క్రీడాభిమానులు అమితాసక్తి కనబరిచారు. IND vs AUS సెమీ ఫైనల్ మ్యాచ్‌కు వ్యూస్ 66 కోట్లు, గత నెల 23న జరిగిన IND vs PAK మ్యాచ్‌కు 60.2 కోట్ల వ్యూస్ వచ్చాయి.