AP: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పుర, నగరపాలక సంస్థల, నగర పంచాయతీల ఉద్యోగులకు ఆదివారం, సోమవారం సెలవులను రద్దుచేసింది. ఈ నెల 30, 31 తేదీల్లోనూ పన్ను వసూళ్ల కౌంటర్లు పని చేసేలా చర్యలు తీసుకుంది. వడ్డీపై రాయితీ వినియోగించుకునేందుకు ఈ నెల 31వ తేదీతో గడువు ముగియనుంది. ఈ క్రమంలో ఆది, సోమవారాలు కూడా ఆస్తి పన్ను వసూలు కౌంటర్లు ఉదయం 6 నుంచి రాత్రి 9గంటల వరకు పని చేసేలా రాష్ట్ర పురపాలకశాఖ చర్యలు చేపట్టింది.