గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు

69చూసినవారు
గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు
AP: గురుకుల స్కూళ్లలో ప్రవేశాలకు ప్రభుత్వం గడువు పెంచింది. వచ్చే నెల 6వ తేదీలోపు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. గురుకుల స్కూళ్లలో ఐదో తరగతితో పాటు 6, 7, 8 తరగతులలోని మిగిలిన ఖాళీలను భర్తీ చేయనున్నారు. https://aprs.apcfss.in/ వెబ్‌సైట్ ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ఫస్టియర్ సీట్ల భర్తీకి కూడా ఏప్రిల్ 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్