ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 11 పరుగులకే ఔట్ అయ్యాడు. ఆరో ఓవర్లో మ్యాట్ హెన్రీ వేసిన నాలుగో బంతికి క్యాచ్ ఇచ్చి కోహ్లీ పెవిలియన్ చేరాడు. దీంతో 7 ఓవర్లకి టీమిండియా స్కోర్ 30/3 గా ఉంది. హెన్రీ కోహ్లీ వికెట్ తీయడం ఇది రెండోసారి. ఇది కోహ్లీకి 300వ ODI మ్యాచ్. ఈ మ్యాచ్‌లో కోహ్లీ కేవలం 2 ఫోర్లు మాత్రమే కొట్టాడు.