రెండో టెస్టులో భారత్ ఓటమి

68చూసినవారు
రెండో టెస్టులో భారత్‌పై కివీస్‌ 113 పరుగుల తేడాతో విజయం సాధించింది. 359 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు.. 245 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ (77) రాణించగా.. మిగతావారు భారీ స్కోర్లు చేయలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లతో చెలరేగిన మిచెల్ శాంట్నర్.. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో మూడు టెస్టుల సిరీస్‌ను న్యూజిలాండ్ 2-0తో కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్