వరుసగా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరిన భారత్

82చూసినవారు
వరుసగా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరిన భారత్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించి ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ఈ విజయంతో భారత్ వరుసగా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరిన జట్టుగా నిలిచింది. గతంలో 2013, 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌ చేరిన టీమిండియా తాజాగా 2025 ఫైనల్‌కు చేరుకుంది. రేపు జరిగే న్యూజిలాండ్-సౌతాఫ్రికా సెమీఫైనల్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో మార్చి 9న భారత్ ఫైనల్‌లో తలపడనుంది.

సంబంధిత పోస్ట్