2050 నాటికి భారత్‌లో వృద్ధుల జనాభా రెట్టింపు

75చూసినవారు
2050 నాటికి భారత్‌లో వృద్ధుల జనాభా రెట్టింపు
2050 నాటికి 60 ఏళ్లకు పైబడిన వృద్ధుల సంఖ్య ఇండియాలో 346 మిలియన్లకు చేరుతుందని ఐక్యరాజ్యసమితి జనాభా కార్యకలాపాల నిధి వెల్లడించింది. వృద్ధాప్యంలో మహిళలు ఒంటరితనం, పేదరికాన్ని ఎదుర్కొనే అవకాశం అధికంగా ఉన్నట్లు పేర్కొంది. 2050 నాటికి దేశంలో 50శాతం పట్టణాలు ఉంటాయని అంచనా వేసింది. దీంతో మురికివాడల పెరుగుదల, వాయు కాలుష్యం, పర్యావరణ సమస్యలను తీర్చడానికి స్మార్ట్‌ సిటీలు, మౌలిక సదుపాయాలు చాలా కీలకమని పేర్కొంది.

సంబంధిత పోస్ట్