ఫైనల్‌లో గెలుపు.. టీమిండియా సంబరాలు

58చూసినవారు
ఫైనల్‌లో గెలుపు.. టీమిండియా సంబరాలు
న్యూజిలాండ్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంపై టీం ఇండియా ప్లేయర్లు స్పందించారు. శ్రేయాస్ అయ్యర్ మాట్లాడుతూ.. 'ఆనందంగా ఉంది. మాటల్లో చెప్పడం కష్టం. ఇది నా మొదటి ICC ట్రోఫీ. అందరినీ చూస్తుంటే నాకు మాటలు రావడం లేదు' అన్నారు.
హార్దిక్ పాండ్యా: 'ICC టోర్నమెంట్ గెలవడం ఎల్లప్పుడూ అద్భుతంగా ఉంది, ముఖ్యంగా ఛాంపియన్స్ ట్రోఫీ. 2017 నా హృదయానికి దగ్గరగా ఉంది. ఈసారి అందరూ ఎలా సహకరించారో చూసి సంతోషంగా ఉంది' అని అన్నారు.

సంబంధిత పోస్ట్