దేశీయంగా అభివృద్ధి చేసిన ఫోర్త్ జనరేషన్ వీఎస్హెచ్వోఆర్ఏడీఎస్ (VSHORADS) క్షిపణులను డెవలప్మెంట్ ట్రయల్స్‌లో భారత్ విజయవంతంగా పరీక్షించింది. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్లో ఈ పరీక్షలు జరిగాయి. గగనతల రక్షణ వ్యవస్థకు చెందిన మూడు స్వల్ప శ్రేణి టార్గెట్లను క్షిపణులు విజయవంతంగా ఢీకొట్టాయని డీఆర్డీవో తెలిపింది. డీఆర్డీవోతో పాటు భారత సైన్యాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు.