తమ ప్రభుత్వంలో సాంకేతికతకు పెద్ద పీట వేస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. వికసిత్ భారత్: 2047 లక్ష్యం నెరవేరాలంటే అన్ని రంగాల్లో సాంకేతికత అభివృద్ధి చెందాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. దేశాభివృద్ధికి నూతన ఆర్థిక విధానాలు అవలంభిస్తున్నామని వివరించారు. భారత్ త్వరలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందని స్పష్టం చేశారు.