కమల్ హాసన్, శంకర్ 28 ఏళ్ల తర్వాత 'భారతీయుడు' సీక్వెల్ 'భారతీయుడు-2'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పటికే ఓవర్సీస్‌లో ప్రీమియర్ షోలు పడ్డాయి. ఫస్టాఫ్ విజువల్స్, సేనాపతిగా కమల్ నటన అదిరిపోయాయని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అయితే లోకనాయకుడి గెటప్ ఫెయిల్ అయిందని, మునుపటిలా ఎమోషన్లు వర్కౌట్ కాలేదని మరికొందరు చెబుతున్నారు.