దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నాడు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 147 పాయింట్లు లాభపడి 81,053 వద్ద ముగియగా, నిఫ్టీ 41 పాయింట్లు ఎగిసి 24,811 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్-30 స్టాక్స్‌లో 18 లాభాల్లో ముగియగా, 12 నష్టాల్లో ముగిశాయి. ఎయిర్‌టెల్,
టాటా స్టీల్, ఐడీబీఐ బ్యాంకు, టైటాన్ టాప్ గెయినర్స్‌గా ఉండగా.. ఎన్టీపీసీ,
టాటా మోటార్స్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. డాలర్ మారకంతో రూపాయి 4 పైసలు క్షీణించి రూ.83.94 వద్ద ముగిసింది.