ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడులో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెన్నై ఎయిర్ పోర్టును కొన్ని గంటలు మూసేశారు. అయితే ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ చేసే సమయంలో ఓ విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఇండిగో ఎయిర్‌లైన్స్ ఎయిర్‌బస్ విమానం ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నించగా ప్రతికూల వాతావరణ పరిస్థితులతో నియంత్రణ కోల్పోయింది. దీంతో తిరిగి గాల్లోకి ఎగిరింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.