ప్రతి మనిషికి రోజూ 8 గంటలు నిద్ర తప్పనిసరి అవసరం. పని ఒత్తిడి, ఇతర కారణాల వల్ల 5 గంటల కన్నా తక్కువ సమయం నిద్రపోయే వారిలో 55% మందికి స్థూలకాయం, అధిక బరువు ముప్పు అధికంగా ఉంటుందని పలు పరిశోధనల్లో తేలింది. నిద్రలేమితో గ్రెలిన్(ఆకలి కలిగించే హార్మోన్) అధిక మోతాదులో, లెప్టిన్(సంతృప్త హార్మోన్) తక్కువ స్థాయిలో ఉత్తత్పి అవుతాయి. దీంతో ఆహారం ఎక్కువ పరిమాణంలో తీసుకొనే పరిస్థితి తలెత్తి, బరువు పెరుగుతారు.