తిరుమలలో చెల్లని తెలంగాణ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు!

58చూసినవారు
తిరుమల శ్రీవారి వీఐపీ దర్శనానికి సంబంధించి తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖలను మార్చి 24నుంచి అనుమతిస్తున్న విషయం తెలిసిందే. అయితే తిరుమలలో ఈ సిఫార్సు లేఖలను అనుమతించడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సిఫారసు లేఖలపై ప్రతి సోమ, మంగళవారాల్లో ఒక లేఖపై ఆరుగురికి మించకుండా వీఐపీ బ్రేక్‌ దర్శనాలు కల్పిస్తామని టీటీడీ వెల్లడించింది. ఈ క్రమంలో కొంత గందరగోళం నెలకొన్నదని భక్తులు వాపోతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్