బోనాల పండుగకు సీఎం రేవంత్‌కి ఆహ్వానం!

71చూసినవారు
బోనాల పండుగకు సీఎం రేవంత్‌కి ఆహ్వానం!
ఆషాఢ మాసంలో ప్రారంభమయ్యే బోనాల పండుగ సందర్భంగా జరిగే వేడుకలకు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది. సీఎం రేవంత్ రెడ్డికి దేవాలయ కమిటీ సభ్యులు ఆహ్వానం అందించారు. గోల్కొండ, సికింద్రాబాద్, లాల్ దర్వాజ దేవాలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు సీఎంను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని గజమాలతో సత్కరించారు. కాగా, ఈ ఏడాది ఆషాఢ మాసం మొదటి ఆదివారం అయిన జూలై 7న గోల్కొండ కోటలో బోనాలు ప్రారంభం కానున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్