సీఎం స్టాలిన్‌ రాజీనామా చేయాలి: ఏఐఏడీఎంకే

85చూసినవారు
సీఎం స్టాలిన్‌ రాజీనామా చేయాలి: ఏఐఏడీఎంకే
తమిళనాడులో నాటు సారా తాగి 37 మంది మృతి చెందిన ఘటనపై ప్రతిపక్ష ఏఐఏడీంకే స్పందించింది. ఈ విషాదానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి స్టాలిన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసింది. ఈ దారుణం వెనక డీఎంకే కార్యకర్తల హస్తం ఉందని మాజీ సీఎం, ఏఐఏడీఎంకే నేత పళనిస్వామి ఆరోపించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించి కంటితుడుపు చర్యలు చేపడుతోందని విమర్శించారు. కనీసం రూ.25 లక్షలు సాయం చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్