AP: తిరుమలలో భక్తుల మధ్య గురువారం ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ భక్తుడు ఆసుపత్రి పాలయ్యాడు. తిరుమలలోని సీఆర్వో కార్యాలయం వద్ద భక్తులు క్యూ లైన్‌లో ఉన్నారు. ఆ క్రమంలో తన కుమారుడిని తోసేసిన వ్యక్తిపై అతడి తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ క్రమంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో ఆగ్రహించిన ఆ తండ్రి.. తన చేతిలోని గాజు బాటిల్‌తో ఎదుటి వ్యక్తిపై దాడి చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.