2025లో తొలి సూర్యగ్రహణం మార్చి 29న ఏర్పడనుందని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం అయినప్పటికీ భూమిపై నుంచి చూస్తే పాక్షికంగానే కనిపిస్తుందని చెప్పారు. ప్రపంచంలో కొన్ని దేశాల్లో మాత్రమే గ్రహణం కనిపిస్తుందని భారతీయులు ఈ గ్రహణాన్ని చూసే అవకాశం లేదన్నారు. మార్చి 29న భూమి, సూర్యుడికి మధ్య చంద్రుడు ప్రయాణించే క్రమంలో సూర్య గ్రహణం ఏర్పడుతుందని నాసా వెల్లడించింది.