వంటగది ఎంత శుభ్రం చేసీన కొందరి ఇళ్ళలో బొద్దింకలు స్వైర విహారం చేస్తుంటాయి. వీటిని వదిలించుకోవడానికి ఇంటి చిట్కాలు ప్రయత్నించడం మంచిది. అదేంటంటే.. నారింజ తొక్కలను ఇంటి ములలో ఉంచడం. ఇందులోని లిమోనెన్ అనే సమ్మేళనం కారణంగా బొద్దింకలు పరరావుతాయి. ముందుగా నారింజ తొక్కలను ఎండలోగాని మైక్రోవేవ్ ఓవెన్‌లోగాని వేడి చేసి ఆరబెట్టవచ్చు. ఈ తొక్కను బొద్దింకలు ఉండే చోట ఉంచాలి. దీంతో బొద్దింకలు దాని వాసనను తట్టుకోలేక దూరంగా పోతాయి.