కారణమేంటో తెలిస్తే జబ్బులను నయం చేయొచ్చు. కానీ ఆటిజంకు కచ్చితమైన కారణమేంటో తెలియదు కాబట్టి నయం చేయలేం. ఇది జబ్బు కాదు. ఎదుగుదల లోపంతో ముడిపడిన సమస్య. దీన్ని నయం చేసే మందులు, చికిత్సలేవీ లేవు. కానీ మెదడును ప్రేరేపితం చేయటం ద్వారా కొంతవరకూ లోపాలను సరిచేసే, లక్షణాలను తగ్గించే అవకాశముంది. తగు శిక్షణ ఇవ్వటం ద్వారా నైపుణ్యాలు పెంచుకునేలా, పెద్దయ్యాక తమ పనులు తాము చేసుకునేలా తీర్చి దిగ్గొచ్చు.