న్యూ ఇండియాకు ISB విద్యార్థులు బ్రాండ్ అంబాసిడర్‌లు: సీఎం రేవంత్ రెడ్డి

74చూసినవారు
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఐఎస్‌బీ లీడర్ షిప్ సమ్మిట్ ప్రారంభమైంది. ఈ సమ్మిట్‌కు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్, తెలంగాణతో పాటు న్యూ ఇండియాకు ISB విద్యార్థులు బ్రాండ్ అంబాసిడర్‌లు అని కొనియాడారు. తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల జీడీపీ ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే హైదరాబాద్‌ను 600 బిలియన్ డాలర్ల నగరంగా మార్చాలని అన్నారు.

సంబంధిత పోస్ట్