అస్సాంలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. రూ. 6 కోట్ల విలువ చేసే 637 గ్రాముల హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మణిపూర్‌లోని కంగ్‌పోక్పి నుంచి అస్సాంలోని దిగువ రాష్ట్రాలకు కారులో మాదక ద్రవ్యాలను తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో అస్సాం పోలీసు స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలు నిఘా పెట్టి ఈ ముఠాను పట్టుకున్నాయి. ఈ హెరాయిన్‌ను గువహటిలోని ముర్తజా అహ్మద్ వద్దకు తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.