సంఘ సంస్కర్తగా, నవయుగ వైతాళికుడిగా, స్త్రీ విద్య కోసం పాటుపడిన, మూఢాచారాలకు వ్యతిరేకంగా జీవితాన్ని గడిపిన కందుకూరి వీరేశలింగం బహుముఖ ప్రజ్ఞావంతుడు. వీరేశలింగం పంతులు 1848 ఏప్రిల్ 16న రాజమండ్రిలో పున్నమ్మ, సుబ్బారాయుడు దంపతులకు జన్మించారు. వీరి పూర్వీకులు ఇప్పటి ప్రకాశం జిల్లాలోని కందుకూరు గ్రామం. అక్కడి నుండి రాజమండ్రికి వలస వెళ్ళడం వల్ల వారికి ఆ ఇంటి పేరు స్థిరపడిపోయింది.