AP: ఓ వైపు కాకినాడ సీపోర్టు వాటాల బదిలీ, మరోవైపు ఏపీ లిక్కర్ స్కాం.. ఇలా రెండు కీలక కేసులు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని నిద్ర పోనివ్వకుండా చేస్తున్నాయి. ఈ కేసుల నుంచి బయటపడాలంటే విజయసాయిరెడ్డికి బీజేపీనే దిక్కు. ఆ పార్టీలో చేరేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, అనకాపల్లి ఎంపీ రమేశ్ ససేమిరా కాదంటున్నారు. వారిద్దరి నుంచి సమ్మతి లేకుండా సాయిరెడ్డి బీజేపీలోకి చేరే ఛాన్సే లేదు. ఈ మేరకు సాయిరెడ్డి ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.