విద్యుత్ బిల్లుల భారం భరించలేకే ప్రజలు గత ప్రభుత్వాన్ని ఇంటికి పంపారు. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ భారాలు మోపబోమని టిడిపి కూటమి ప్రభుత్వం తన ఎన్నికల మానిఫెస్టోలో పొందుపరిచింది. అందుకు భిన్నంగా ఇప్పుడు ప్రజలపై భారాలు మోపేందుకు సిద్ధమైంది. ఇప్పటికే పెరిగిన విద్యుత్ బిల్లులను చెల్లించలేక వినియోగదారులు లబోదిబోమంటున్నారు. ఇప్పుడు మరో భారం మోపితే వినియోగదారుల పరిస్థితి దారుణంగా ఉంటుంది.