ఏడాదైంది.. కేసీఆర్ ఎప్పుడైనా ప్రతిపక్ష నేత పాత్ర పోషించారా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నల్గొండ బహిరంగ సభలో సీఎం పాల్గొని మాట్లాడారు. శాసనసభలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉండటం తెలంగాణ సమాజానికి మంచిది కాదని హితవు పలికారు. ఓడిపోతే ప్రజాక్షేత్రాన్ని వదిలిపెట్టడం మంచిది కాదని.. కేసీఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. గెలిస్తే ఉప్పొంగటం.. ఓడితే ఫామ్ హౌస్ కు పరిమితం కావడం మీ స్థాయికి తగదని చెప్పారు.