మహా కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారు. బుధవారం మౌని అమావాస్య కావడంతో భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఇదే అదనుగా ఫ్లైట్ ట్రావెల్ ఏజెన్సీలు టికెట్ ధరలను భారీగా పెంచేశాయి. సాధారణ సమయాల్లో ఢిల్లీ-ప్రయాగ్‌రాజ్ ఫ్లైట్ టికెట్ రూ.5 వేలు ఉండగా ప్రస్తుతం దానిని రూ.32వేలుగా నిర్ణయించాయి. దీంతో 'ఢిల్లీ నుంచి ప్రయాగ్‌రాజ్ కంటే లండన్‌కు (రూ.24 వేలు) వెళ్లడం చీప్ అని ఓ ప్రయాణికుడు ట్విటర్‌లో పోస్ట్ పెట్టాడు.