సంపద సృష్టి అంతా తూచ్: వైసీపీ

76చూసినవారు
సంపద సృష్టి అంతా తూచ్: వైసీపీ
ఏపీలోని కూటమి ప్రభుత్వంపై YCP విమర్శలు చేసింది. 'సూపర్‌ సిక్స్‌లు.. సెవెన్లు అంటూ ఎన్నికల హామీలతో ఊరించి 7నెలల పాటు నెట్టుకొచ్చిన CM ముసుగు తొలగించారు. సంపద సృష్టి అంతా తూచ్. సూపర్-6‌పై చేతులెత్తేశారు. డబ్బులు లేవంటూ ఇప్పుడు తప్పించుకునే ఎత్తుగడ. ఎన్నికల్లో హామీలు ఇచ్చేటప్పుడు మాత్రం సంపద సృష్టించి ఇస్తానంటూ గప్పాలు.. నమ్మించి వెన్నుపోటు పొడిచే నైజాన్ని చంద్రబాబు మళ్లీ బయటపట్టారు' అని మండిపడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్