‘ఎండు తెగులు’.. ఈ తెగులు ఆశించిన మొక్కలు వడలి, ఎండిపోయి పంటకు అధిక నష్టం వాటిల్లుతుంది. ఇది భూమిలో ఉన్న శిలీంధ్రం ద్వారా వ్యాపిస్తుంది. దీని నివారణకు ఒకే పైరును ఓకే పొలంలో ఏళ్ల తరబడి వేయకూడదు. పొలంలో నీరు నిల్వలేకుండా చూడాలి. పైరు విత్తుకొనే ముందు తప్పనిసరిగా కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బెండజిమ్ (లేదా) మాంకోజెబ్‌ని పట్టించి విత్తుకోవాలి.