TG: గల్లంతైన కార్మీకుల జాడ దొరక్కపోయినా సొరంగం లోపలి పరిస్థితులపై ఇప్పుడు స్పష్టమైన అవగాహన ఏర్పడిందని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న అధికారులు తెలిపారు. నాలుగు, ఐదో ప్రయత్నంలో సొరంగం కూలిన చోట పేరుకున్న మట్టి, శిథిలాల సమీపం వరకు రెస్క్యూ బృందాలు చేరుకోగలిగాయని వివరించారు. లోకో ట్రైన్ ద్వారా సొరంగం లోపలికి వెళ్లిరావడానికే మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతోందని తెలిపారు.