దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల నడుమ మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో సూచీలు ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. సెన్సెక్స్ 101 పాయింట్లు పెరిగి 75,555 వద్ద కొనసాగుతుండగా నిఫ్టీ 9 పాయింట్లు కుంగి 22,546 వద్ద కదలాడుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 86.88 వద్ద కొనసాగుతోంది.