తమిళనాడులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కేంద్రం తమపై హిందీ భాషను బలవంతంగా రుద్దడానికి ప్రయత్నిస్తోందని అధికార డీఎంకే ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తమిళనాడు రాజధాని చెన్నై రైల్వే స్టేషన్ నేమ్ బోర్డులపై కొంతమంది నల్ల రంగు పూసి హిందీ అక్షరాలకు కనిపించకుండా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.