అనర్హత వేటు భయంతోనే వైఎస్ జగన్ అసెంబ్లీకి వస్తున్నారని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. జగన్ ఈ ఒక్కరోజే అసెంబ్లీకి వస్తారా? అన్ని రోజులు వస్తారా అన్నది తెలియదన్నారు. ప్రతిపక్ష హోదా లేని పార్టీకి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. జగన్‌కు మోదీ కాళ్ల మీద పడే అలవాటు ఉందని.. ఈ అలవాటుతోనే ఆయన కాళ్ల మీద పడి అసెంబ్లీలోకి వెళ్లేందుకు చట్టం మార్పు చేసి తెచ్చుకో అంటూ ఎద్దేవా చేశారు.