TG: అప్పుల బాధతో మరో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 24 గంటల్లో రాష్ట్రంలో ఇది ముడో ఘటన. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి చెందిన కౌలు రైతు జెల్లా దేవయ్య(51) అప్పుల బాధతో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దేవయ్య గ్రామానికి సమీపంలో కొంత పొలాన్ని కౌలుకు తీసుకొని వరి పంట సాగు చేశాడు. అయితే వరి సాగుకు నీరు అందక పంట ఎండిపోవడంతో.. అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురై పురుగు మందుతాగి ప్రాణాలు తీసుకున్నాడు.