జగిత్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం మున్సిపల్ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధం జిల్లా మొదటి మహాసభ నిర్వహించారు. ఈ మహాసభకు రాష్ట్ర నాయకులు మున్సిపల్ కార్మిక రంగం రాష్ట్ర అధ్యక్షులు కే రవి చందర్ రాష్ట్ర కార్యదర్శి వి జైపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని కార్మికుల హక్కులకై ఐకమత్యంగా పోరాడాలని పలు అంశాలపై మాట్లాడారు. జగిత్యాల జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.