పురాణాల ప్రకారం శ్రీ కృష్ణుడు శ్రావణం మాసంలోని బహుళ పక్ష అష్టమ తిథి, రోహిణి నక్షత్రంలో అర్థరాత్రి జన్మించాడు. అయితే ఈ ఏడాది కృష్ణాష్టమి రెండు రోజులు వచ్చింది. ఆగస్టు 26 నుంచి 27 వరకు అష్టమ తిథి ఉంది. ఆగస్టు 26న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆగస్టు 27 తెల్లవారుజామున 12.44 గంటల వరకు కృష్ణ జన్మష్టమికి పూజ చేసుకోవడానికి శుభ సమయమని పండితులు చెబుతున్నారు.