ప్రస్తుతం మంకీపాక్స్ నివారణకు రెండు టీకాలు వినియోగంలో ఉన్నాయి. వీటిని గత వారమే ప్రపంచ ఆరోగ్య సంస్థ స్ట్రాటజిక్ అడ్వైజరీ గ్రూప్ అత్యవసర వినియోగానికి లిస్టింగ్ చేసింది. దీంతో గావీ, యూనిసెఫ్ కొనుగోలు చేసి పంపిణీ చేసేందుకు మార్గం సులభమైంది. ఈ టీకాలను చాలా ప్రపంచదేశాల్లో ఆయా ఆరోగ్య విభాగాలు అనుమతులు జారీ చేయకపోవడం కొంత సమస్యాత్మకం కానుంది. తాజాగా డబ్ల్యూహెచ్‌వో నిర్ణయంతో ఈ ప్రక్రియలు వేగవంతం కానున్నాయి.