హర్యానాలో జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) నేతను దుండగులు కాల్చి చంపేశారు. పానిపట్‌లోని వికాస్ నగర్‌లో జేజేపీ నేత రవీందర్ మిన్నాపై కొందరు వ్యక్తులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన రవీందర్ మరణించారు. ఈ కాల్పుల్లో మరో ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. కుటుంబగొడవల నేపథ్యంలో దుండగులు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.