సీఎం రేవంత్ రెడ్డిపై BRS నేతలు పోలీసులకు వరుస ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ పార్టీ నేత, మాజీ మంత్రి జోగు రామన్న ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలంకు ఫిర్యాదు చేశారు. పలు హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్, ప్రజలను మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని.. అక్రమ కేసులు పెట్టడం మానుకోవాలని జోగు రామన్న కోరారు.