సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ ఎన్నికయ్యారు. 70 ఏళ్ళు దాటిన నేతలకు రాష్ట్ర కమిటీ నుంచి ఉద్వాసన పలకడంతో వయసు రీత్యా కమిటీ నుంచి తమ్మినేని వీరభద్రం, మాజీ MLC సీతారాములు, నర్సింగ రావు తప్పుకోవాల్సి వచ్చింది. తెలంగాణ ఆవిర్భావం నుంచి 3 సార్లు తమ్మినేని తెలంగాణ రాష్ట్ర సీపీఎం కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంగారెడ్డిలో ఈ నెల 25 నుంచి CPM రాష్ట్ర 4వ మహాసభలు నిర్వహిస్తున్నారు. ఈ సభలో కొత్త కార్యదర్శి ఎన్నికను నిర్వహించారు.