'కాళేశ్వరం' ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇవాళ న్యాయ విచారణ ప్రారంభించనుంది. ఇప్పటికే పీసీ ఘోష్ హైదరాబాద్ చేరుకున్నారు. బీఆర్కే భవన్లో ఉన్న కమిషన్ కార్యాలయంలో విచారణ జరగనుంది. విచారణలో భాగంగా పలువురు అధికారులు, ఇంజినీర్లు, ప్రైవేటు వ్యక్తులకు సమన్లు జారీ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విచారణ రెండు వారాల పాటు కొనసాగుతుంది.